శతాబ్ది ఉత్సవాలకు ఓయూ ముస్తాబు
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు శరవేగంగా ముస్తాబవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరుగుతున్న వందేళ్ల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఓయూ శతాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రరావు తెలిపారు. వందేళ్ల వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 26, 27వ తేదీల్లో తెలంగాణ సాంస్కృతిక, సాంప్రదాయ కళలతో పాటు అనేక సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.








