14న అమెరికాలో ఓయూ శతాబ్ది వేడుకలు
చికాగోలోని ఇల్లినాయి ప్రాంతంలో ఈ నెల 14న గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఆ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రానికి ఆహ్వానం అందినట్టు ఓయూ ప్రజా సంబంధాల అధికారి వెల్లడించారు. ఈ సదస్సుకు చికాగోలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా నీతాభూషణ్, రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలేర్డ్ అండ్ టెక్నాలజీ వైస్‌చాన్సలర్ డాక్టర్ సత్యనారాయణ సిరసాని హాజరవుతారని తెలిపారు. ఉత్సవాలను ఏడాది పొడవునా ఎలా నిర్వహించాలన్నదానిపై ఒక సావనీర్‌ను విడుదల చేయడంతో పాటు, ఎగ్జిబిషన్, అలుమ్మి అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు గ్లోరి ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.








