రక్షణ, విమానయాన రంగాల హబ్‌గా హైదరాబాద్
రక్షణ, విమానయాన రంగాల హబ్‌గా హైదరాబాద్ రక్షణ, విమానయాన రంగాల హబ్‌గా హైదరాబాద్ త్వరలోనే సాక్షాత్కరించనుందని రాష్ట్ర సాంకేతిక సమాచార, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు పునరుద్ఘాటించారు. విమానయానం, అంతరిక్షం, రక్షణ రంగాలకు ఇప్పటికే హైదరాబాద్ గమ్యస్థానమైందన్నారు.
ఆదిభట్ల సెజ్‌లో న్యూకాన్ ఏరోస్పేస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. విమానయానం, అంతరిక్షం, రక్షణ రంగాలకు సంబంధించి ఉత్పత్తి, అమరిక, ఏవియేషన్ స్పేస్, రక్షణరంగ ఉత్పత్తుల పరీక్షల సదుపాయాలను ఈ సంస్థ అందించనుంది. న్యూకాన్ ఏరోస్పేస్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను రక్షణ, వైమానిక రంగాల హబ్‌గా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆదిభట్ల, శంషాబాద్‌లలో రెండు ఏరోస్పేస్ పార్క్‌లను అభివృద్ధి చేశామన్నారు. మూడో ఏరో స్పేస్ పార్క్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే, హైదరాబాద్‌లో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను త్వరలో నిర్వహిస్తామన్నారు.








