ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వికీడేటా శిక్షణ
ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో వికీడేటా కార్యశాల, శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సీఈఓ విష్ణువర్ధన్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంజారాహిల్స్ రోడ్డులోని ఎన్టీఆర్భవన్లో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు 9100433445కు కాల్ చేయాలని సూచించారు.








