కోమటిరెడ్డి బ్రదర్స్ కోటరీలో కొత్త వ్యక్తి…. కమలం దారికి ఈయనే మార్గదర్శి
నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి సోదరుల హవా అందరికీ తెలిసిందే. మంత్రి పదవులు అనుభవించారు. వైఎస్ హాయాంలో ఇచ్చిన చేయూతతో ఆర్థికంగా ఎదిగారు. ఈ సోదరులు ఇప్పుడు పెద్ద పదవిపై కన్నేశారు. కాంగ్రెస్‌లోనే పీసీసీ అధ్యక్షుడు కావాలని కలలు కన్నారు. ఇందుకోసం పెద్ద స్కెచ్ వేశారు. హైకమాండ్‌లో అండగా ఉన్న డిగ్గీరాజా మార్పుతో ఈ సోదరులకు ఇప్పుడు గ్రిప్ పోయింది. కొత్తగా వచ్చిన కుంతియా ఉత్తమ్ డైరెక్షన్లో నడుస్తున్నారు. దీంతో పీసీసీ పదవిపై ఆశలు వదిలేసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం వైపు చూపులు చూస్తున్నారు. అయితే ఆరు నెలలుగా ఈ మాట విన్పిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఒక పరిణామం కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం వైపు వెళుతున్నారనే విషయానికి సంకేతాలు వెలువడ్డాయి.
కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ప్రచారం కోసం ఇటీవల రాజ్ న్యూస్‌ను లీజ్‌కు తీసుకున్నారు. న్యూస్ ఛానల్ ను లైన్లో పెట్టారు. అయితే ఇటీవల ఈ ఛానెల్లో బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ఎంట్రీ ఇచ్చారు. సలహాదారు పాత్రలో ఆయన ఈ ఛానెల్లో అడుగుపెట్టారు. ఇంతకుముందు ఈయన హెచ్ఎమ్టీవీలో ఉండేవారు. ఇప్పుడు కోమటిరెడ్డి ఛానెల్లో కనిపించడంపై గుసగుసలు మొదలయ్యాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లేందుకు రూట్‌మ్యాప్ ఈయన సిద్ధం చేశారని అంటున్నారు. బీజేపీ అధ్యక్ష పదవితో పాటు నల్గొండ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలు బ్రదర్స్‌కి ఇస్తారని చెబుతున్నారు. మొత్తానికి దసరా తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.








