హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచి ప్రారంభం
ప్రైవేట్‌రంగంలో అతి పెద్ద బ్యాంక్‌గా గుర్తింపు పొందిన ఐసీఐసీఐ బ్యాంక్ 4850 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కస్టమర్లకు విశేష సేవలందిస్తోంది. హైదరాబాద్, సికందరాబాద్లో దాదాపు 175 బ్రాంచీలను కలిగి ఉంది. తాజాగా కూకట్‌పల్లిలో ఆగస్టు 16వ తేదీన మరో బ్రాంచీని ప్రారంభించింది.
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ ప్రేమ్‌కుమార్ ముప్పారెడ్డి, అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు పత్రిక ‘తెలుగు టైమ్స్’ ఎడిటర్, మేనెజింగ్ డైరెక్టర్ చెన్నూరి వెంకట సుబ్బారావు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ, బ్యాంక్ సిబ్బంది కస్టమర్లకు మరింతగా సేవలందించి బ్యాంక్‌కు మరింత పేరు తీసుకురావాలని కోరారు. సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ, భారత్‌లో నేటితరానికి అవసరమైన సేవలందించే నెంబర్ వన్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ బ్రాంచి కూడా కస్టమర్ల విశ్వాసానికి అనుగుణంగా సేవలందించి మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ రీజినల్ హెడ్ మధుసూదన సుర మాట్లాడుతూ, కూకట్పల్లి ఏరియాలో ఇది 5వ బ్రాంచి అని చెప్పారు. పబ్లిక్, ట్రేడర్స్ నుంచి మంచి స్పందనను ఇప్పటికే బ్యాంక్ అందుకుందన్నారు. బ్రాంచి మేనెజర్ శిల్పాఎరుకుల్ల మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో తమ బ్యాంక్‌కు మంచి గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని చెప్పారు. కస్టమర్లకు మరింతగా సేవలందిస్తామని తెలిపారు.








