మురళీధర్ రెడ్డి గంగుల చొరవతో గూటికి చేరిన రాజు బక్కాయల
నిజామాబాదు వాసి, రాజు బక్కాయాయల, 34 వయస్సు, రాంపూర్-డిచ్పల్లి మండల్. నిజామాబాద్ జిల్లా
పాస్‌పోర్ట్ నెం: K8269529(x0620016), మదద్ గ్రి.ఐ.డి. KURPT102265017, కువైట్ సివిల్ ID: 203040806036 రెసిడెన్స్ పర్మిట్ ముగిసి 4 సంవత్సరాలు ఐంది.
ఇండియన్ ఎంబసీ లో ఫిర్యాదు No.1847- మూడు నెలల క్రితం రిజిస్టఋ చేసినాడు. ఇతని స్థానిక పరిస్థితులు:చాలపేదవాడు, తండ్రి పెద్ద రాజన్న – ఆరోగ్యం బాగాలేదు, పాత మట్టి పెంకుటి ఇల్లు మంచి స్థితిలో లేదు, ఇతను ఒక్కడే కొడుకు, వివాహితుడు, ఇద్దరు అక్కలు, పోరంబోగు భూమి 1.5 ఎకరం ఉంది. అతనికి 3 లక్షల అప్పు ఉంది.
మొదట లక్షన్నర ఖర్చు పెట్టి దుబాయ్ లో బిల్డింగ్ కార్మికుడిగా పనిచేశాడు – కంపెనీ మూసి వేయడం నష్టం తో నే తిరిగి వచ్చినాడు ! మళ్ళీ లక్ష ఖర్చు పెట్టి ఆగష్టు 2013 లో కువైట్ ఒచ్చి ఏజెంట్లు మోసానికి గురి అయ్యి ఎలక్ట్రీషియన్‌గా వచ్చివ్యవసాయ లేబర్ గాపనిచేయవలసి వచ్చింది, ఉదయం 4.30 నుండి రాత్రి 10.30 లేదా 11 వరకు ఉండవుమొక్కలకు మందులుచల్లడం అతని చేతులు పాడు అయినవి , తోటి కార్మికులు తినిపిస్తే తినేవాడు ,. వీసా రెనివాలు కోసం రూ. 87000) చెల్లించి మల్లిమోసపోయాడు .అందుకు అక్కడి నుండి పారిపోయాయి వేరే దగ్గర పనికి కుదిరి 12 గంటల ఉద్యోగం తక్కువ జీతం, గత 3 నెలలనుండి అతను అనారోగ్యంతో ఉన్నాడు, ప్రక్రుతి కి వెళ్ళినపుడు రక్తం ఒచ్చేది, ప్రైవేటు ఆసుపత్రి లోచూపించుకుని మందులువాడినాడు.ఇతనికి ఇక్కడ పైసా పుట్టలేదు. అతని స్నేహితులు తనను రూమ్ లోనే ఉండమని, ఆహారానికి సహాయానికి ముందుకు ఒచ్చారు.
మదద్ రిజిస్ట్రేషన్ మరియు ఎంబసీతో, రాజు తో మాట్లాడుతూ కోఆర్డినేషన్ మురళీధర్ రెడ్డి గంగుల చేసుకున్నారు.
ఇండియన్ ఎంబసి వారు అతని ఆరోగ్యానికి ఏమైనా లెటర్స్ కావాలన్నా, అవుట్ పాసులు కావాలన్నా సహకారాన్నిఅందించారు. ఇతని మీద పారిపోయిన కేసు ఉన్నందున విడిపించడం ఆలస్యం ఐంది. మరొక వెల్ఫేరిస్టు అలీ గారి సహాయం వల్ల బయట పడ్డాడు. సొంత గూటికి 4rth -సెప్టెంబర్-17 3.30pm కి చేరినాడు.
ప్రభుత్వానికి అభ్యర్ధన – మంత్రి వర్యులు శ్రీ KTR గారు NRI శాఖను ఏర్పరచడం శుభసంకేతం తన నేతృత్వం లో ఇంకా త్వరితగతిన ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలి, జిల్లా అధికారులు ఈ శాఖద్వారా భవిష్యత్తు కార్యక్రమాలు బాగా చేయాలి. ఇటువంటిాధితులు కోకొల్లలు, తప్పని సరిగా కొంత బడ్జెట్ వీరి కోసం టికెట్స్ కోసం కేటాయించగలరు. ఇంటికి చేరినాక వీరినిఅత్యంత బీద కుటంబాలు గా పరిగణించి ఆరోగ్య భీమా, రక్షం, డబల్ బెడ్ రూమ్, కుటుంబానికి ఉద్యోగ విద్య అవకాసలహాలనుఉచితంగా ఇచ్చి ఉపాధి కల్పించాలి.








