ఎంపీ కవితకు నవీన్ పట్నాయక్ అభినందన
ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాల నివారణకు శిరస్త్రాణం వాడకంపై దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవితను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు. ఎంతో ముఖ్యమైన సందేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం ప్రశంసనీయమన్నారు. దీనికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని, అందరూ ఇందులో పాల్గొనాలని ఆయన ట్విట్టర్లో పిలుపునిచ్చారు.








