విజయవాడ నుంచి పోటీ చేసినా గెలుస్తా!
వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడ నుంచి పోటీ చేసినా గెలుస్తానని అక్కడ కూడా తనకు మిత్రులు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి చెప్పారు. రానున్న ఎన్నికల్లో సూర్యాపేట నుంచే పోటీ చేస్తారా? లేక మరో స్థానం నుంచి పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.








