వేగంగా మిషన్ భగీరథ పనులు
వచ్చే సంవత్సరం జనవరికల్లా ఇంటింటికి తాగునీటిని అందించేందుకు వీలుగా జిల్లాలో రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో మిషన్ భగీరథ పనులు చేపడుతున్నట్లు రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్రెడ్డి వెల్లడించారు. మిషన్ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్ దివ్య, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గడువులోగా ఇంటింటికి తాగునీటిని అందించేందుకు వీలుగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.








