జనవరి 31 నుంచి మేడారం జాతర
మేడారం మహాజాతరకు తేదీలు ఖరారయ్యాయి. సమ్మక్క, సారలమ్మ జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. ఈ మేరకు 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జాతర జరుగుతుందని పూజారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సిద్దబోయిన జగ్గారావు, చందా గోపాల్రావు వెల్లడించారు.






