తెలంగాణలో రుణాలు సులభం…
ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం పెద్ద ఇబ్బందేమీ కావడంలేదని తెలంగాణలో 46 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలుస్తోంది. తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ వ్యాపారాలు ప్రారంభించడానికి, భూమి, నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతులు పొందడంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడంలేదని ఉత్పాదక సంస్థలు అభిప్రాయపడ్డాయి. యువపారిశ్రామికవేత్తలు అధికంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలపై దృష్టిసారించారు. మాన్యుఫాక్చరింగ్ స్టార్టప్స్‌లో 63 శాతం మహారాష్ట్ర, తెలంగాణ గుజరాత్‌ల్లోనే ఉన్నాయి.













