కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి : కేటీఆర్
అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బిఆర్ఎస్ (BRS) అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ (KTR) అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి, మళ్లీ బీఆర్ఎస్ ను పట్టాలెక్కించేందుకు పోరాటం చేస్తామని వెల్లడించారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పార్టీ పునరంకితమవుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి








