మంత్రి కేటీఆర్కు మరో జాతీయ అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావుకు మరో జాతీయ అవార్డు దక్కింది. ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో మంత్రి కేటీఆర్ని ప్రముఖ సంస్థ స్కోచ్ సన్మానించింది. 49వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో స్కోచ్ అవార్డును కేటీఆర్ అందుకున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నందుకు మంత్రి కేటీఆర్కు ఈ గుర్తింపు దక్కింది. స్కోచ్ సమ్మిట్ లో తెలంగాణ ఐటీ స్టాళ్లను కేటీఆర్ సందర్శించారు.








