చేనేత కొత్త పుంతలు!
ఈ ఫొటో గ్రాఫిక్స్‌తో, డిజిటల్ టెక్నాలజీతోనో ప్రింట్ చేసింది కాదు. చేనేత చీరపై ఆవిష్కరించిన అద్భుతం ఇది. సిరిసిల్లకు చెందిన నేతకారుడు టెక్నాలజీని అందిపుచ్చుకుని తన కళని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అనడానికి నిదర్శనం ఇది. సిరిసిల్లకు చెందిన విజయ్ అనే నేతకారుడు తన నేత పనికి సాంకేతికతను జోడించి అద్భుతాన్ని ఆవిష్కరించారు. డిజిటల్ ప్రింటింగును తలపించే చేనేత వస్త్రాన్ని తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. కేటీఆర్ దంపతుల ఫొటోను చీరపై నేసి తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. ఈ చీరను మంత్రి కేటీఆర్‌కు బహుకరించనున్నట్లు విజయ్ తెలిపారు. సిరిసిల్లలో ఈ ప్రయోగం చేసి సఫలమైన వ్యక్తి తానొక్కడేనని విజయ్ తెలిపారు.













