బిజెపి వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ చూపు?
కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పార్టీ మార్పుపై ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నుండి ఆహ్వానం అందినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ లో బిజెపి పటిష్టతకు కోమటిరెడ్డి బ్రదర్స్ చేరిక ఉపకరిస్తుందని కమల దళం భావిస్తోంది. అమిత్‌షా నుండి సంకేతాలందినట్లు ఇటు కోమటిరెడ్డి వర్గీయుల్లో, అటు నల్లగొండ బిజెపి నాయకత్వంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పుపై గుంభనంగా వ్యవహరించి కాంగ్రెస్‌ను వీడుతున్న ప్రచారాన్ని ఖండిం చే ఎత్తుగడను అనుసరిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. బిజెపిలో చేరిన పక్షంలో కాంగ్రెస్ నుండి భారీగా వలసలతో సాగి అమిత్‌షా త్వరలో తెలంగాణ పర్యటన సందర్భంగా, లేక వచ్చే నెలలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగానైనా కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం తీర్ధం పుచ్చుకోవచ్చని భావిస్తున్నారు.








