అభ్యంతరమెందుకు?
తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర ఒకటి, రెండు విడతల కార్యక్రమానికి లభించిన ప్రజా మద్దతును చూసి ఓర్వలేక మూడవ విడత కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురిచేసిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. అనుమతి కోసం పోలీసుల వద్దకు వెళితే ఏకంగా మూడు గంటల పాటు నాటకీయ పరిణామాలతో రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేసారని ధ్వజమెత్తారు.








