మహిళల రిజర్వేషన్లకు ఎంఐఎం వ్యతిరేకం : కిషన్ రెడ్డి
దక్షణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియ జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని ప్రతిపక్షాలు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్ల పెంపు నిర్ణయం తీసుకుంటే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ (Congress), బిఆర్ఎస్ (BRS) కలిసి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. మహిళల రిజర్వేషన్లకు ఎంఐఎం వ్యతిరేకం. ఈ అంశంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లను కలిపింది ఎంఐఎం (MIM) పార్టీయే. సీఎం రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ ఫార్ములా కాదు, అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్మాలా అని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి








