Formula E Car Race : ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ- కార్ రేసు (Formula E Car Race) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఏసీబీ (ACB) ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో ఏ1గా కేటీఆర్ (KTR), ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvind Kumar), ఏ3గా హెచఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకి చెందిన ఎఫఈ ఓ సంస్థను చేర్చింది. హైదరాబాద్లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి రూ.55 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే పురపాలక శాఖ మంత్రి వోదాలో కేటీఆర్ ఆదేశించడంతోనే తాము నిధులు విడుదల చేశామని అప్పట్లో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన అర్వింద్ కుమార్ గతంలోనే ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలంతో పాటు ఏసీబీ విచారణలోనూ అంగీకరించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








