భూ సర్వేతో వివాదాలకు శాశ్వత పరిష్కారం : కెసిఆర్
భూమి సర్వేతో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ప్రగతి భవన్లో భూసర్వేపై సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమగ్ర భూ సర్వేతో రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తీసుకువస్తామని ఆయన చెప్పారు. భూమి రికార్డులు, రిజిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండాలని ఆయన అన్నారు.








