అమెరికాకు డిప్యూటీ సీఎం కడియం
20 రోజుల అమెరికా పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆయన సతీమణి వినయారాణితో కలిసి బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్, స్టేషన్ ఘన్పూర్ నేతలు కడియంకు వీడ్కోలు పలికారు.








