ఘనంగా కడియం జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పుట్టిన రోజు వేడుకలు వరంగల్లో ఘనంగా జరిగాయి. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కడియం శ్రీహరిని కలిసిన టీఆర్ఎస్ నేతలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ నేతలతో పాటు వివిధ సంఘాల నాయకులు, అభిమానులు కడియం శ్రీహరికి పుష్ఫ గుచ్చాలు అందజేశారు. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కడియంకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు
కడియం శ్రీహరికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని వారు ఆకాంక్షించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.













