హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ ఈవెంట్
హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదికకానుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఐఎస్టీ ఏఎఫ్ వరల్డ్ కప్ ఇంటర్ రెగు సెపక్తక్రా చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ టోర్నీ నిర్వహణపై ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ చాంబర్లో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా క్రీడామంత్రి టి.పద్మారావు చైర్మన్‌గా కమిటినీ ఏర్పాటు చేశారు. శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో 20 దేశాలు పోటీపడనున్నాయి. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.








