శ్రీవారి దర్శనానికి విమాన ప్యాకేజీ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి విమాన సర్వీసుతో ప్యాకేజీలు ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ జనరల్ మేనేజన్ సంజీవయ్య తెలిపారు. ఒక రోజు ప్యాకేజీలో హైద్రాబాద్ నుంచి ఉదయం 9:25 గంటలకు బయలుదేరే విమానం 10:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని, అక్కడ రాత్రి 8:30 గంటలకు బయలుదేరి రాత్రి 9:35 గంటలకు హైదరాబాద్ తిరిగి వస్తుందని పేర్కొన్నారు. రెండో ప్యాకేజీలో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాల దర్శనం కూడా చేర్చారు. 040-27702407(హైదరాబాద్), 0866-2572280, 9701360675 (విజయవాడ) నంబర్లలో సంప్రదించాలని కోరారు.








