హైదరాబాద్లో ఇన్వెస్కో ఇన్నోవేషన్ హబ్
ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్లో మరో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటైంది. అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. ఒక అంతర్జాతీయ పెట్టుబడుల నిర్వహణ సంస్థ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని ఇన్వెస్కో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ డోని లోచన్ మీడియాకు తెలిపారు. ఈ ఇన్నోవేషన్ హబ్లో తమ ఉద్యోగుల సరికొత్త ఆలోచనలతోపాటు, బయటి వ్యక్తుల వినూత్న వ్యాపార ఆలోచనలనూ ప్రోత్సహిస్తామన్నారు. ఇందులో భాగంగా జరిగిన హకథాన్లో 60 మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని ఇన్నొవేషన్ హబ్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు వినూత్న ఫిన్టెక్ ఉత్పత్తులను అభివృద్ధి చేసినట్టు ఇన్వెస్కో హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ రవీంద్ర రాపేటి చెప్పారు. తమ కంపెనీ అభివృద్ధికి తోడ్పడేలా ఎక్కువగా ఫిన్టెక్ రంగానికి చెందిన స్టార్టప్ కంపెనీలనే ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.








