హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు
రాజధాని నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతుంది. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి 31 వరకు కణ జీవ శాస్త్రం-2018 సదస్సును నిర్వహించబోతున్నారు. ఇంటర్నేషల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ, ఏషియన్ ఫసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఏపీ ఓసీబీ), ఇండియన్ సొసైటీ ఆఫ్ సెల్ బయాలజీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. సీసీఎంబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, సదస్సు నిర్వాహకులు వేగేశ్న రాథ మాట్లాడారు. నోబెల్ పురస్కార గ్రహీత మార్టిన్ చాల్ఫి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేయనున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో కలిసి శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్‌లో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. 28న ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ పాల్గొంటారన్నారు. 30 దేశాల నుంచి వేయి మంది వస్తారని బెంగళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీఓసీబీ అధ్యక్షుడు సత్యజిత్ మేయర్ తెలిపారు.








