ఈ నెల 21న భారతీయ ఛాయ చిత్రోత్సవం
ప్రతిష్ఠాత్మక భారతీయ ఛాయా చిత్రోత్సవానికి (ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్) హైదరాబాద్ అతిథ్యం ఇవ్వనుంది. తెలంగాణ పర్యాటక శాఖ, చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ, లైట్క్రాఫ్ట్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి వచ్చే నెల 8 వరకు ఉత్సవాలు జరుగుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జాతీయ ఛాయా చిత్రోత్సవాలు గోవా, ఢిల్లీలో జరిగాయని, మూడో ఏడాది హైదరాబాద్లో జరగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాల్లో 40 దేశాలకు చెందిన 625 మంది ప్రముఖ ఛాయా చిత్రగ్రాహకులు పాల్గొంటారన్నారు.








