త్వరలో హైదరాబాద్లో సూనామీ కంప్యూటర్
సముద్రంలో అలల తీవ్రత, సునామీ హెచ్చరికలను పసిగట్టే అత్యంత ఆధునిక సూపర్ కంప్యూటర్ను హైదరాబాద్లోని జాతీయ సముద్ర సమాచార కేంద్రంలో నెలకొల్పనున్నారు. కేంద్ర ఎర్త్ సైన్సెస్ సంస్ధ ఆధ్వర్యంలో ఈ పరికారాన్ని సమకూర్చనున్నారు. ఈ పరికరం ద్వారా సముద్ర గర్భంలో తలెత్తే కదలికలు, పై భాగంలో కనపడే అలలు, ప్రమాదరకమైన సునామీ అలలను ఈ పరికరం క్షణాల్లో పసిగడుతుంది. అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ సునామీని ఇట్టే పసిగడుతుంది. దీని సామర్థం 34 టెరాఫ్లాప్స్ కలిగి ఉంటుంది. నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరికరాన్ని కొనుగోలు చేస్తున్నారు. సింగపూర్ నుంచి ఈ పరికరం త్వరలో వస్తుంది.








