ఒక్కరోజులో వెంకన్నదర్శనం
హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని సాయంత్రానికి తిరిగి వచ్చేలా తెలంగాణ పర్యటకశాఖ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు స్పైస్‌జెట్‌తో ఒప్పందం చేసుకుంది. ఒకరోజు ప్యాకేజీ రూ.9999, రెండు రోజుల ప్యాకేజీ కింద 12999 చెల్లించి ప్రయాణాన్ని ఖరారు చేసుకోవచ్చు. ఉదయం 6:55 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానం బయలుదేరుతుంది. సాయంత్రానికి వెంకన్న దర్శనంతో పాటు సమీపంలోని మరిన్ని దర్శనీయ క్షేత్రాలను చూపిస్తారు. సాయంత్రం 6:35కి తిరుపతి నుంచి విమానంలో బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రస్తుతానికి పర్యటక బుకింగ్ కేంద్రాల్లో ప్యాకేజీల కింద ప్రయాణాన్ని బుక్ చేసుకోవచ్చు.








