దేవుడా మా పిల్లలు!!!
ఈ డ్రగ్స్ కేసు ఎంత సేపూ సినీ పరిశ్రమ చుట్టూ తిప్పుతూ ఎన్నో రకాల పోస్టింగ్స్ వచ్చాయి. ఈ రోజు The Hindu లో వచ్చిన article ‘Hyderabad’s LSD blues’ చదివిన తరువాత భయం నరనరాన పాకుతుంది మన పిల్లలను తలచుకుని.
Hats off to Mr. Sabarwal. పిల్లల భవిష్యత్తు, తల్లితండ్రుల మానసిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వివరాలు పబ్లిక్ చెయ్యకుండా చీప్ పబ్లిసిటీ కి తావు ఇవ్వకుండా చాలా హుందాగా, పూర్తి పరిణతితో వ్యవహరించారు. పోలీసులు మానవతా విలువలు పాటిస్తూ ఇంత మెచ్యూర్డ్ గా వ్యవహరించడం ఇంతకుముందు ఎప్పుడూ నేనైతే చూడలేదు.
ఇదే article లో ఓ 13 ఏళ్ల బాలిక డ్రగ్ కోసం డబ్బుల బదులుగా తన అర్ధ నగ్న చిత్రాన్ని కెల్విన్ కి పంపడం కంట తడి పెట్టించక మానదు













