హైదరాబాద్ కు రంజాన్ శోభ
రంజాన్ పర్వదినం సమీపిస్తుండటంతో రాజధాని హైదరాబాద్లో ఆధ్యాత్యిక శోభ ఉట్టిపడుతోంది. మక్కామసీదు, చార్మినార్ సహా పాతబస్తీలోని పలు చారిత్రక భవనాలు విద్యుద్దీపాల ధగధగల నడుమ మెరిసిపోతున్నాయి. వాటి శోభను కనులారా తిలకించేందుకు సందర్శకులూ పోటెత్తుతున్నారు. నగరానికే ప్రత్యేకమైన హలీం రుచులను ఆస్వాదిస్తూ రాత్రివేళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు షాపింగ్ చేస్తుండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో సందడి నెలకొంది.








