మెట్రో రైలుకు ముహూర్తం ఖరారు!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. అన్నీసవ్వంగా జరిగితే వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా రెండు కారిడార్లలో ప్రారంభోత్సవానికి అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అమీర్‌పేటలో, సికింద్రాబాద్ ఒలిఫెంటా వంతెన వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపేసి పగలురాత్రి పనులు నిర్వహిస్తున్నారు.








