ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్ మెట్రోరైల్ మొదటి దశను నవంబర్‌లో ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో అదే సమయంలో మెట్రోరైల్‌ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాశారు. రూ.15వేల కోట్ల వ్యయంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మెట్రోరైల్‌ను కేసీఆర్ అభివర్ణించారు. మెట్రోరైల్‌ను మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. మొదటి దశ మెట్రోరైల్‌ను నవంబర్‌లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం, ఆయన్ని ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది.








