నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభం
మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల పరిధిలో నవంబర్ నెల నుంచి మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ మేరకు నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభానికి విచ్చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖను ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు. మెట్రోరైలును ప్రారంభించాల్సిందిగా 25-5-2017న వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ లేఖలో గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. నవంబర్‌లో ఇందుకోసం రావాలని ఈ లేఖలో కోరారు. రూ. 15,000 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అతిపెద్ద ప్రాజెక్టుగా.. హైదరాబాద్ మెట్రోరైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని లేఖలో పేర్కొన్నారు.








