ఐటికి మత్తు
డ్రగ్స్ కేసు ఇప్పుడు ఐటి రంగంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ పరిశ్రమతో పాటుగానే మరోవైపు ఐటి రంగంలోనూ డ్రగ్స్ వ్యాపించిందని ఎక్సైజ్ శాఖ దర్యాప్తులో తేలింది. డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఐటి కంపెనీల సాఫ్ట్వేర్ ఉద్యోగులను గుర్తించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారి పేర్లతో కూడిన జాబితాను ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌కు అందజేసింది. ఎక్సై జ్ శాఖ వివరాల ఆధారంగా చర్యలకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. వివిధ ఐటి సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకున్న డ్రగ్స్ ముఠా వారికి సురక్షితంగా డ్రగ్స్‌ను అందిస్తూ వచ్చింది. ఈ తతంతం కొన్నేళ్లుగా జరుగుతున్నా.. తాజాగా సినీ రంగ డ్రగ్స్ కేసు ద్వారానే వెలుగులోకి వచ్చింది,








