జబర్దస్త్, పటాస్ షోలకు హెచ్ఆర్సీ నోటీసులు
బూతును ఎక్కువ ప్రోత్సహిస్తున్నారంటూ జబర్దస్, పటాస్ టీవీ “షో”లపై పలువురు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ “షో”ల నిర్వాహకులకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సోటీసులు జారీ చేసింది. ఈ షోలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది.








