హైదరాబాద్ లో హై అలెర్ట్
దేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించే ప్రమాదవుందని, కెమికల్ బాంబులు ఉపయోగించి విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్ విభాగం హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లో హై అలెర్ట్ ప్రకటించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడంతో తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని విమానాశ్రయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను దింపారు. హైదరాబాద్లోని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ప్రధాన కూడళ్లలో సిసికెమెరాలతో నిఘా పెంచారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులపై నిఘా పెట్టాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు.








