ఘనంగా హెరిటేజ్ పుడ్స్ రజతోత్సవాలు
ఈ సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభమైన హెరిటేజ్ పుడ్స్ రజతోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని ట్రైడెండ్ హోటల్ వేదికైంది. గత పాతికేళ్లుగా కంపెనీతో కలిసి పని చేసిన అందరినీ ఈ ఉత్సవాలకు ఆహ్వానించారు. ముగింపు ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హెరిటేజ్ పుడ్స్ వైస్ చైర్పర్సన్, ఎండి నారా భువనేశ్వరి, ఏపి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రముఖ నటుడు బాలకృష్ణ, కంపెనీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








