Harish Rao: పేదల ఇళ్లపై బుల్డోజర్ల యుద్ధమా?.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్!
Harish Rao: మూసీ ప్రాజెక్టు పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కనీసం డీపీఆర్ (DPR) సిద్ధం చేయకుండానే పేదల ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందని ప్రశ్నించారు.
డీపీఆర్‌పై ప్రశ్నల వర్షం:
మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి సమగ్ర నివేదిక (DPR) సిద్ధంగా ఉంటే దానిని తక్షణమే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీపీఆర్ రూపొందించడానికి 18 నెలల సమయం పడుతుందని రెండు నెలల క్రితమే చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఏ ప్రాతిపదికన కూల్చివేతలకు సిద్ధమైందని నిలదీశారు. ప్రాజెక్టు వివరాలు ప్రజల ముందు ఉంచకుండానే 10 వేల ఇళ్లను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని హరీశ్‌రావు ఆక్షేపించారు.
ఇవి కూడా చదవండి
ఆర్థిక నిర్వహణపై విమర్శలు:
ప్రభుత్వ వద్ద నిధులు లేవని చెబుతూనే, రూ.1.50 లక్షల కోట్ల భారీ వ్యయంతో మూసీ సుందరీకరణ చేపట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తూ, మరోవైపు భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్టులను తెరపైకి తీసుకురావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి








