Harish Rao: రాజ్యాంగాన్ని రక్షించడమంటే ఇదేనా? : హరీష్ రావు
పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ కి లేఖ రాశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని మేనిఫెస్టోలో చెప్పారు. రాహుల్ గాంధీ ( Rahul Gandhi) రాజ్యాంగం చేతబట్టి దేశవ్యాప్తంగా నీతి సూత్రాలు చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ (Telangana)లో మరోలా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) రక్షించడమేంటే ఇదేనా? ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవకాశవాదం కోసం వాడుకుంటున్నారు అని లేఖలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి








