ఇప్పుడు ఉషాపతి ఉపరాష్ట్రపతి అయ్యారు : గవర్నర్
తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడం గర్వకారణమని గవర్నర్ నరసింహన్ అన్నారు. రాజ్భవన్లో వెంకయ్యకు పౌరసన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తాను ఉషాపతినే కానీ ఉపరాష్ట్రపతిని కాదన్నారాయన. ఇప్పుడు ఉషాపతి ఉపరాష్ట్రపతి అయ్యారని తెలిపారు. వెంకయ్య ఎదుగుతూ ఒదుగుతూ ఉన్నత స్థానానికి చేరారని ఆయన కొనియాడారు. ఇటీవల వెంకయ్యతో చేసిన విందు గొప్ప అనుభూతి.రాజ్యసభ చైర్మన్గా సభను సమర్థంగా నిర్వహిస్తారని అన్నారు.








