గవర్నర్ ఎట్ హోంలో ఇద్దరు చంద్రులు
రాజ్భవన్లో మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావులు హాజరయ్యారు. వారికి గవర్నర్ స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకువచ్చారు. అయితే ఇంతకు ముందు కూడా ఇద్దరు సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈసారికి ఉన్న ప్రత్యేక వేరని తెలుస్తోంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాలు ఎన్నోసార్లు చర్చలు జరుపుకున్నాయి. ఒక్కోసారి గవర్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు మరింత చేరువయ్యారు.








