వైభవంగా గోల్కొండ బోనాలు
గోల్కొండ బోనాల ఉత్సవాలు అంత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహంకాళీ (ఎల్లమ్మతల్లీ) అమ్మవారికి ప్రత్యేక పూజలతో మొదటి పూజను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఆదివారం మధ్యాహ్నాం లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారి భారీ తొట్టెలకు ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌తోపాటు నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు ప్రారంభమైంది. డప్పువాయిజ్యలు, శివసత్తుల పునకం, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతతో… భక్తులు అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భక్తిశ్రద్ధలతో ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకుంటారని పేర్కొన్నారు.








