వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా ఉంటా
ఏ లక్ష్యం కోసమైతే తాను జెండా చేతపట్టానో ఆ లక్ష్యం నెరవేరేంత వరకు తన జెండాను విడిచిపెట్టనని ప్రజా యుద్ధనౌక సృష్టం చేశారు. పార్టీ నుంచి వైదొలిగానే తప్ప, తాను చేతపట్టిన జెండాను కిందపడేయలేదన్నారు. ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓట్ల విప్లవం వైపు వచ్చానన్నారు. ఒక చేతిలో గుదుపా, మరో చేతిలో ఓటు తన నినాదం అని చెప్పార. ఎన్నికలకు ముందు ఐక్య సంఘం నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయన్నారు. ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా ఉంటానని, అవసరమైతే కింగ్‌ని అవుతానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్నది భౌగోళిక తెలంగాణ మాత్రమేనని, త్యాగాల తెలంగాణా కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పాలకులు మాత్రమే మారారు. పరిపాలన ఏమాత్రం మారలేదన్నారు. బీసీల్లో మెజార్టీ ప్రజలు రాజకీయ చైతన్యంతో ఆలోచించాలని సూచించారు. ఐసిఎస్ల చేతికి పాలనా బాధ్యతలు దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎత్తివేయడం ఇప్పటి పాలకులకు చేతకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.








