బోధనానుభవం లేని టీచర్లకు ఉచిత శిక్షణ : నారా బ్రహ్మణి
విద్యార్హత ఉండి బోధనానుభవం లేని వారికి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించినట్లు ట్రస్ట్ పాలక మండలి సభ్యురాలు నారా బ్రహ్మణి తెలిపారు. భోధన వృత్తిలో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వీలుగా ఈ శిక్షణ ఉంటుంది. సీనియర్ అధ్యాపకులు అందించే ఈ శిక్షణకు 25 మంది చొప్పున స్త్రీ, పురుషులకు ఎంపిక చేసి రెండు వారాలపాటు శిక్షణ ఇవ్వాలని సంకల్పించారు. గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో శిక్షణకు హాజరయ్యే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారు. శిక్షణ తర్వాత ఎన్టీఆర్ విద్యాసంస్థలతో సహా ఇతర విద్యాసంస్థల్లో ఉద్యోగాలు వచ్చేలా ట్రస్టు సహాయ పడుతుందని బ్రహ్మణి తెలిపారు. బోధన అనుభవంలేని కారణంగా టీచర్ ఉద్యోగం పొందలేని ప్రతిభావంతులు, అర్హత కలిగిన వారికి ఈ శిక్షణ వల్ల మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇంగ్లిష్ మీడియాంలో బోధించడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా తమ వివరాలు జూతీఱఅషఱజూaశ్రీబిఎరష్ట్రవసఏఅ్త్ీతీబర్.శీతీస్త్ర కు పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8885553475, 9912341941, 9248444919 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.













