ఎవరినీ కావాలని టార్గెట్ చేయడం లేదు
డ్రగ్స్ కేసులో ఎవరనీ టార్గెట్ చేయలేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో అకున్సబర్వాల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సినీరంగాన్ని లక్ష్యంగా చేసుకుని విచారణ సాగుతోందని వస్తున్న వార్తలను ఆయన తప్పుబట్టారు. డ్రగ్ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. సిట్ విచారణపై మిమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎవరినీ కావాలని టార్గెట్ చేయడం లేదని సృష్టం చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఏ రంగపై వివక్ష లేదని తెలియజేశారు. చట్టబద్దంగానే విచారణ జరుగుతున్నదని ఆయన వివరించారు. కేసులో అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషిస్తున్నామన్నారు. పిల్లలను కూడా ఇలానే ప్రశ్నిస్తారనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు విచారణకు సహకరిస్తున్నారన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటి వారున్నా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని ఆయన చెప్పారు.








