ఈటల ఇంట మొదలైన పెళ్లి సందడి
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈటల రాజేందర్ మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామ పరిధిలో, ఓఆర్ఆర్ పక్కనే నూతనంగా నిర్మించిన ఇంట్లో ఆయన తనయుడు నితిన్ వివాహ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ వివాహం ఆదివారం హైటెక్స్‌లో జరగనుంది. దీంతో రెండు రోజుల ముందుగానే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వివాహవేడకులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు మంత్రి ఈటల దంపతులు ఘనస్వాగతం పలికారు. గంటసేపు గవర్నర్ దంపతులు వేడుకలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం నితిన్‌ను వారు ఆశీర్వదించారు.













