మంత్రులు చేయవచ్చు
ఎన్నికల్లో మంత్రులు ప్రచారం చేసుకోవచ్చని, అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడనంత వరకు ఎన్నికల కమిషన్కు అభ్యంతరం లేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్లాల్ పేర్కొన్నారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మంత్రులు కూడా రాజకీయ నాయకులేనని, ప్రజాప్రతినిధులేనని, అందువల్ల ఎన్నికల్లో ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. మంత్రుల హోదాలో వాహనాలను దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ సిబ్బందిని యధేచ్ఛగా ఎన్నికల కోసం వాడుకుంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల కోడ్ను అతిక్రమించనంత వరకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారం చేసుకుంటే తాము (ఎన్నికల కమిషన్) జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.








