దిగ్విజయ్ సింగ్‌కు కాంగ్రెస్ షాక్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. దిగ్విజయ్ బాధ్యతల్ని ఆ పార్టీ సీనియర్ నేత ఆర్.సి కుంతియాకు అప్పగిస్తూ ఏఐసీసీ నిర్ణయించింది. కుంతియాతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా సతీష్ నియామకం అయ్యారు. తెలంగాణ ఏర్పడక ముందు నుంచే దిగ్విజయ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.








