గోల్డెన్ సిటీగా పాతబస్తీ
హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీని గోల్డెన్ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ అన్నారు. ఐఎస్ సదన్ డివిజన్ బాలాజీనగర్‌లో రూ.40లక్షల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.








